Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి

పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి

- Advertisement -


30 శాతం పంటల్ని 
కూడా కేంద్రం కొనట్లేదు
ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించండి
సీపీఐ(ఎం) నేతలతో సీఎం రేవంత్‌‌రెడ్డి
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన పంటలను సరిగ్గా కొనటం లేదనీ, పండించిన పంటల్లో 30 శాతం కూడా సేకరించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి ఎత్తిచూపారు. పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఐ(ఎం) నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో సీపీఐ(ఎం) బృందం భేటీ అయింది. ఈ భేటీలో ఎంపీ వేం నరేందర్‌‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ..రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీనిచ్చారు. బెంగాల్ ఎన్నికల వల్ల కొంత హమాలీల కొరత ఏర్పడిందనీ, ఎండ వల్ల మధ్యాహ్నం సమయంలో పని జరగట్లేదనీ, ఫలితంగానే పంటల కొనుగోళ్లలో కొంత ఆలస్యం అవుతుందని చెప్పారు.
పంటల కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష‍ నిర్వహిస్తున్నామన్నారు. 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మొక్కజొన్న ను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మూసీ నిర్వాసితులకు స్థానికం గానే నివాసాలు మంజూరు చేస్తామని తెలిపారు. మూసీపైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ ప్రజలు రోగాల బారిన పడుతున్నా ఆ పార్టీలకు పట్టదా? అని నిలదీశారు. నగర ప్రజలకు క్వాలిటీ లైఫ్‌ ఇవ్వడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామనీ, మూసీ ప్రాజెక్ట్ వల్ల యువత కు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ విద్యను ప్రక్ష‍ాళన చేస్తున్నామనీ, నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్,భోజనం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామనీ, ఆరుట్ల స్కూల్ ను సీపీఐ(ఎం) నేతలు ఒకసారి సందర్శించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -