– అంతర్గత రోడ్లు లెవల్ చేయించిన మునిసిపల్ చైర్మన్
నవతెలంగాణ – అయిజ
అయిజ పట్టణ పరిధిలో ప్రధాన రహదారి అంబెడ్కర్ చౌక్ దగ్గర పెద్దవాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలని మునిసిపల్ చైర్మన్ చిన్న దేవన్న. 17 వ వార్డు కౌన్సిలర్ శశికళ ఆధ్వర్యంలో కలిసి దగ్గరుండి దొజర్ తో అంతర్గత రోడ్లను చదును చేయించారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ కు వెళ్లేందుకు గాను కేవలం ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహనాలకు మాత్రమే వెటర్నరీ హాస్పిటల్ ముందు నుండి అక్షర స్కూల్ రోడ్డు మరియు సీఐటీయు ఆఫీస్ ముందు నుండి నేరుగా కొత్త బస్టాండ్ లోకి, అలాగే ఫిల్టర్ రాజు మినరల్ ప్లాంట్ నుండి పాత కూరగాయల మార్కెట్ రోడ్లను వాహనదారులకు ఇబ్బందులు లేకుండా గుంతలు చదును చేయించారు. అలాగే నూతనంగా వెటర్నరీ హాస్పిటల్ నుండి శ్రీ మాధవ్ థియేటర్ వరకు నిర్మించిన సిసి రోడ్డు పై వాటర్ క్యూరింగ్ కోసం వేసిన మట్టి మడులను డోజర్ తో చదును చేయించి అందుబాటులోకి తీసుకురావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆర్&బీ వాళ్ళ ముందస్తు సమాచారం లేక కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం జరిగిందని,లేకపోతే ముందుగానే రోడ్లను చదును చేయించే వారమని, ఇకపై ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. బారి వాహనాలు మాత్రం పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ మీదుగా ఉప్పలదొడ్డి రోడ్ ద్వారా కర్నూల్ రోడ్ కు శ్రీ తిక్క వీరేశ్వర స్వామి దేవాలయం వెనుక నుండి పోతుల జనార్ధన్ రెడ్డి ఫామ్ హౌస్ మీదుగా ఎం ఆర్ ఓ ఆఫీస్ రోడ్ కు వెళ్లాలని పట్టణంలోని అంతర్గత రోడ్లపైకి బారి వాహనాలు రాకూడదని సూచించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ధర్నా చెప్పిన సందర్భంగా రోడ్డు పనులను చేపట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మన్న ,బిల్ కలెక్టర్లు నాగరాజు,నరేష్,మహేంద్ర నాథ్,అడివన్న,ఆంజనేయులు, వీరేష్, సురేష్, జయరాములు సురేందర్, ఆనంద్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు..