నవతెలంగాణ – చందుర్తి
ఓ వ్యక్తి అదృశ్యం ఐన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట గ్రామానికి చెందిన శ్రీ రాముల వెంకట రాములు(60) గత రెండు రోజులుగా కనపడకపోవడంతో బంధువులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం రాములు బంధువులు పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.