
దామెర ప్రాదమికొన్నత పాఠశాల కుసేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.75,000 రూపాయల విలువైన పాఠశాల ఉపకరణ సామాగ్రి, ప్రింటర్, బోధన అభ్యసన సామాగ్రిని శుక్రవారం సేవా స్పూర్తి పౌండేషన్ ద్వారా అందించిన సామాగ్రీ ని మండల అభివృద్ధి అధికారి స్వర్ణ కుమారి చేతులమీదుగా అందించారు. ఈసందర్బంగా ఆమె సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం పాఠశాలకు రూ.75,000 విలువైన సామాగ్రి అందించినందుకు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపకులు ఒంగూరు విజయ భాస్కర్ రెడ్డికి, సేవాస్పూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ ఊరే సుగ్రీవ రెడ్డి ,ప్రాజెక్టు మేనేజర్ ర్నాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్బంగా సేవాస్పూర్తి ఫౌండేషన్ స్థాపకులు, అధ్యక్షులు ఒంగూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దామెర ప్రాథమికోన్నత పాఠశాలకు ఏ అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని వసతులు కల్పించే విధంగా కృషి చేస్తామని, గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలలోనే విద్యార్థులను చదివించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ వూరే సుగ్రీవ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్ , వూరే బుచ్చిరెడ్డి ,వూరే విజయ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వర్ణ కుమారి, గ్రామ మాజీ సర్పంచ్ దామెర యాదగిరి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బలుసుల నాగరాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం, ఉపాధ్యాయులు బత్తుల యాదయ్య, గుంటి వెంకటరమణ, జ్యోతి, శ్రీహరి, గురిజ మహేష్, ఉజ్వల , రాచమల్ల శ్రవణ్ కుమార్, శిరీష , బుడిగపాక రవి , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.