నేడు నిజామాబాద్ నగరంలో లో త్రాగు నీటి సరఫరా కు అంతరాయం..

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు అనగా శనివారం త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఉందని సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని బోధన్ రోడ్డు,మాలపల్లి ఖాన్ సాబ్ సిమెంటు షాప్ వద్ద అలి సాగర్ ఫీడర్ పైపు లైను ఎత్తు పెంచి,మారుస్తున్న కారణంగా శనివారం అనగా తేదీ:15.07.2023 నాడు క్రింది ప్రాంతాల్లో ఉదయం త్రాగు నీటి సరఫరా వుండదు అని తెలియజేశారు. నాగారం, ఇంద్ర పుర్, వినాయక్ నగర్, గోల్ హనుమన్, ఎల్లమ్మ గుట్ట, సుభాష్ నగర్, నాందేవ్ వాడ,గంగస్తాన్, హమాల్వాడి, దుబ్బ, గౌతం నగర్, కంటేశ్వర్, చంద్ర శేకర్ కాలనీ, ఎళ్ళమ్మగుట్ట, పోచమ్మ గల్లి, గోల్ హనుమాన్, అర్స పల్లి, మాలపల్లి, అహ్మద్ పుర కాలనీ, హబీబ్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు గమనించగలరని తెలియజేశారు
Spread the love