ఎన్నికలవేళ చెత్త సేకరణకు  అంతరాయం

నవతెలంగాణ- రామారెడ్డి:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామపంచాయతీ సిబ్బంది ఎన్నికల పనుల్లో నిమగ్నమవడంతో, ఇండ్ల నుండి చెత్త సేకరించకపోవడంతో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు మరమ్మత్తు చేయించలేక చెత్త సేకరించకపోవడం, గ్రామపంచాయతీ సిబ్బంది అటు ఎన్నికల పనులు, పారిశుద్ధ్య పనులు చేయలేక, పారిశుద్వానికి అంతరాయం కలుగుతుంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పారిశుద్ధ్య కార్మికులను వెంటనే, పారిశుద్ధ్య పనులను నిర్వహించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love