సాయుధ పోరాట చరిత్ర వక్రీకరణ

– త్యాగాల వారసులు కమ్యూనిస్టులే
నవతెలంగాణ – ఎర్రుపాలెం
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టుల త్యాగాల చరిత్ర అని సాయుధ పోరాట నిజమైన వారసులుగా వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియ పరచ వలసిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలపైనే ఉందని సాయుధ పోరాట చరిత్రనే వక్రీ కరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర రావు విమర్శించారు. మండల పరిధిలోని మీనవోలు, రేమిడిచర్ల గ్రామాలలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సందర్భంగా పొన్నం మాట్లాడుతూ తెలంగాణ సంస్థానాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్‌ వారి పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన రైతాంగ సాయుధ పోరాటానికి ఎదురొడ్డి గ్రామానికి చెందిన తోట వెంకయ్య, మెట్టెల శ్రీ రాములు, బండి వీరయ్య, రాంపల్లి రామయ్య, తోట బాలయ్య, సుఖభోగి ముత్తయ్య, పిల్లి కాటయ్య, ఏడుగురు కామ్రేడ్లు బ్రిటిష్‌ వారి జరిపిన మారణ కాండకు వారు కాల్చిన తూటాలకు ప్రాణాలు అర్పించి అమరులైనారని అన్నారు. వారి ప్రాణతర్పంతో మీనవోలు గ్రామం పోరాటాల పురిటి గడ్డగా చరిత్ర పుటలకెక్కిందని అన్నారు. గ్రామంలో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కార్యకర్తలు పని చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, రామిశెట్టి సురేష్‌, షేక్‌ నాగుల మీరా, మొహిద్దిన్‌, కుర్ర వెంకటరామయ్య, మేకల పుల్లయ్య, అంకాలరావు, హుస్సేన్‌ రావు, నాగులవంచ వెంకట్రామయ్య, లగడపాటి అప్పారావు, మాదల వెంకట నరసయ్య, సగుర్తి సంజీవరావు, గామాసు జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.
సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
సీపీఐ(ఎం) నాయకులు కిలారు శ్రీనివాసరావు
వైరాటౌన్‌ : మండలంలోని గొల్లెనపాడు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరుల స్థూపం వద్ద పార్టీ జెండాను సీనియర్‌ నాయకులు కామ్రేడ్‌ కొణిదన ధర్మారావు ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శివర్గ సభ్యులు కిలారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కామ్రేడ్‌ కొణిదన సీతారామయ్య, కొణిదన సత్యనారాయణ, వెంపటి సాంబయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. వీరితో పాటు పరోక్షంగా అనేక మంది పాల్గొన్నారని, అమర వీరుల ఆశయాలు కొనసాగిస్తూ కార్మిక, కర్షక వర్గ పోరాటాలు కొనసాగించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) గ్రామ శాఖ కార్యదర్శి అమరనేని వెంకటేశ్వరరావు, ఆళ్ల రాంబాబు, సండ్ర ప్రసాద్‌, వెంపటి రాజేశ్వరరావు, సిహెచ్‌ రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love