చిన్నారులకు బాలామృతం పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామ అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులకు బాలామృతం పంపిణీ చేసినట్లు అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లల తల్లులు పోషకాహారం తీసుకోవాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శోభా, ఆశ వర్కర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

Spread the love