బతుకమ్మ చీరల పంపిణీ

నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కు చీరల పంపిణీ ప్రారంభించింది. అందులో భాగంగా మండల కేంద్రానికి వచ్చిన బతుకమ్మ చీరలను శుక్రవారం స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ లు ఆప్షన్ సభ్యులు దిలావర్ స్వామి చేతుల మీదుగా దిండి గ్రామపంచాయతీల సర్పంచులకు కార్యదర్శులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసారి సాధారణ చీరలకు అదనంగా వయోవృద్ధ మహిళలకు ధరించే తొమ్మిది మీటర్ల పొడవు గల చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించడం విశేషం అన్నారు. చేనేత కార్మికులకు చేతుల్లో పని కల్పించి వారి ఉపాధి కూడా సహాయపడ్డారని అన్నారు. క్రమంలో 18 గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపిఓ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love