
మండలంలో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు మేడారంలో జంపన్న వాగు వరద ఉధృతికి నిస్సహాయులైన వడ్డెర కులానికి చెందిన 30 కుటుంబాలకు సోమవారం హైదరాబాద్ వడ్డెర కులస్తులు, వడ్డెర సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ఆలకుంట రమేష్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కుటుంబానికి 25 కేజీల బియ్యం ఉప్పు, పప్పు, బియ్యం, కారం, మంచి నూనె నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ఆలకుంట రమేష్ మాట్లాడుతూ మేడారంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తులు వరద ఉధృతికి మొత్తం కొట్టుకొని పోయి వడ్డెరల జీవితాలు దుర్భరంగా మారాయని, అది తెలుసుకొని నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన హైదరాబాద్ వడ్డెర సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మేడారంలో ఉన్న వడ్డెర నిరుపేద వరద బాధితులకు ఎవరైన దాతలు ఉన్న, సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండికోట సాంబ రావు, పల్లపు మహేందర్, గండికోట ప్రసాద్, గండికోట సాగర్, ఆలకుంట చిన్న, గుంజే జంపయ్య, రాపోలు సంపత్, ఆలకుంట సారయ్య, మరియు వడ్డెర సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.