కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – జూబ్లీహిల్స్‌
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ,శనివారం కార్పొరేటర్‌ రాజ్‌ కుమార్‌ పటేల్‌తో కలిసి వెంకటగిరి చౌరస్తాలో యూసఫ్‌ గూడా డివిజన్‌ లోని వెంకటగిరి, శ్రీకష్ణ నగర్‌ బి మరియు సి బ్లాక్‌ లకు చెందిన 13 మందికి ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయలు చొప్పున కల్యాణ లక్ష్మి, షాదీ ముబా రక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్‌పేట్‌ మండల అధికారులు ధీరజ్‌, భీమ్‌ సింగ్‌, డివిజన్‌ అధ్యక్షుడు సంతోష్‌ ముదిరాజ్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్‌ దాస్‌, డివిజన్‌ స్థాయి నాయకులు కైసర్‌ జహాన్‌, గీతా గౌడ్‌, మాధవి ,అమ్మాజీ, అరుణ ,అశోక్‌, ప్రసన్న ,నాగరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మేయర్‌
బంజారాహిల్స్‌ : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ 115 చెక్కులను షేక్‌పేట్‌ తాసిల్దార్‌ అనితారెడ్డితో కలిసి బంజారా లీక్‌ వ్యూ ఫంక్షన్‌ హాల్‌లో లబ్దిదారులకు అందజేశారు. శనివారం మేయర్‌ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్‌ డివిజన్‌కు చెందిన లబ్దిదారులకు 39 చెక్కులు.. 31 షాది ముబారక్‌ 8 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు రెవెన్యూ అధికారులతో కలిసి అందజేశారు.

Spread the love