180 మంది లెర్నింగ్ లైసెన్స్ లు పంపిణీ

నవతెలంగాణ-దుబ్బాక రూరల్
సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం దుబ్బాక మండలానికి చెందిన 180 మందికి లెర్నింగ్ లైసెన్స్ పత్రాలను అందించినట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ ఎంపీ చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దుబ్బాక నియోజకవర్గ కేంద్రానికి చెందిన యువత, ప్రజలకు తాము ఈ లెర్నింగ్ లైసెన్స్ పత్రాలను అందించామన్నారు. అధికారుల పర్యవేక్షణలో ట్రైయల్ చేసిన వారికి లైసెన్సులు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ ఈర్షద్ హుస్సేన్, దుబ్బాక మండల బీఆర్ఎస్  పార్టీ యూత్ ఇంచార్జ్ అంబటి జగన్ గౌడ్,  దుబ్బాక మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మర్కంటి నవీన్,  పెద్దగుండవెల్లి గ్రామ బీఆర్ఎస్  పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పడాల నరేష్, బిట్ల పర్శారాములు తదితరులు ఉన్నారు.
Spread the love