తాగునీటి కొరత లేకుండా చూడాలి:జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు

నవతెలంగాణ పెద్దవంగర: మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు జిల్లా సహకార అధికారి, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేణుమాధవ్ అధ్యక్షతన తాగునీటి పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఇంటికి సరిపడా తాగు నీటిని అందించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీ లకు పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా అన్ని చేతి పంపులు మరమ్మతు చేయించడమే కాకుండా అవసరమైతే వ్యవసాయ బోర్లను లీజు కు తీసుకొని తాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, మిషన్ భగీరథ ఏఈఈ యాకూబ్ పాషా, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love