ఏఈ కార్యాలయాల ఎదుట ధర్నాను జయప్రదం చేయండి

– కేవీపీిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
నిరుపేద దళితులకు జీవో నెంబర్‌ 342 ప్రకారంగా 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు గహ అవసరాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ ఏఈ కార్యాలయాల ముందు ఈనెల 25న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. బుధవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పెద్ద బండలో దళితులు చేత దరఖాస్తులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఉద్యోగులకు, ధనవంతులకు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, వత్తిదారులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, భూమిలేని నిరుపేద దళితులకు గహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 100 యూనిట్లను జీవో నెంబర్‌ 342 ప్రకారం ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రతి దళిత అర్హత గల కుటుంబం కులం సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, విద్యుత్‌ కనెక్షన్‌ జిరాక్స్‌ పత్రాలతో ఏఈ కార్యాలయాల ముందు ధర్నాకు హాజరై దరఖాస్తుల సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి గారే నరసింహ, జిల్లా నాయకులు కోట సైదులు రత్నం, యాదయ్య, దాసరి ఆనంద్‌, దూలపల్లి గిరి, చింత ఎల్లయ్య, బచ్చలకూరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టల్స్‌కు పక్కా భవనాలు నిర్మించాలి
నకిరేకల్‌ : జిల్లాలో సంక్షేమ హాస్టల్స్‌ అద్దె భవనాలలో ఉండడం వలన అనేక ఇబ్బందులకు విద్యార్థులు గురవుతున్నారని పక్కా భవనాలు నిర్మించాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. బుధవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నకిరేకల్‌లోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల కళాశాల వసతి గహం రేకులతో ఉండటం వల్ల వర్షానికి కురుస్తుందన్నారు. బాలికల వసతి గహానికి దశాబ్ద కాలంగా పక్కాభవన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోతుందని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో నిర్వహణలో లోపాలను సరి చేసుకోవాలని, నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని, విద్యార్థులను హాస్టల్‌ వదిలి వెళ్ళకుండా బాధ్యతగా వ్యవహరించి హాజరు పెంచాలని వార్డెన్లకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లపై సమగ్ర సర్వే నిర్వహించామని సమస్యలపై ఆందోళన పోరాటం నిర్వహిస్తామ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు వంటిపాక కష్ణ, జిల్లా నాయకులు తాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love