Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రధాని పర్యటనలకే పరిమితం కావొద్దు

ప్రధాని పర్యటనలకే పరిమితం కావొద్దు

- Advertisement -

విభజన హామీలను నెరవేర్చాలి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రేపు రాస్తారోకోలు
పెట్రో ఉత్పత్తుల కొరతపై 4న నిరసనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణకు ఈ నెల పదో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రావడం శుభపరిణామమనీ, అయితే, పర్యటనకే పరిమితం కాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌,అమెరికా చేస్తున్న యుద్ధాన్ని ప్రధాని మోడీ ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు. దేశంలో చమురు కొరత లేనట్టయితే కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఈ నెల రెండో తేదీన మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, పెట్రో ఉత్పత్తుల కొరతపై నాలుగో తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. వాటిని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, కలవేన శంకర్‌, వీఎస్‌.బోస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ…పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే సర్‌ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సహకార సంఘాలకు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సైతం మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పడం శుభపరిణామం అన్నారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -