Homeతెలంగాణ రౌండప్బదిరుల మనోభవాలకు, హక్కులకు భంగం కలిగించొద్దు

బదిరుల మనోభవాలకు, హక్కులకు భంగం కలిగించొద్దు

- Advertisement -

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి దీప కాసరగడ్డ
నవతెలంగాణ-వనపర్తి 

బదిరుల మనోభావాలకు, హక్కులకు భంగం కలిగించొద్దని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి దీప కాసరగడ్డ అన్నారు. అంతర్జాతీయ బాధిరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా వైద్యశాఖ బృందంతో కలిసి నాగవరం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి  మాట్లాడుతూ బదిరులను మనస్థాపానికి గురిచేసినట్లు మాట్లాడిన వారిని ఆ లోపంతో దూషించిన చట్ట ప్రకారం శిక్ష అర్హులు అవుతారని తెలియజేశారు. వారికి కేటాయించిన హక్కులను వారు పొందేలా ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి శాస్త్ర చికిత్స అందించారు. డాక్టర్ మారుతి నందన్ మాట్లాడుతూ జ్ఞానేంద్రియాలను కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, మధుమోహన్, వైద్యురాలు విద్యారాణి, కళాశాల ప్రధానోపాధ్యా యులు విజయలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -