సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
హైదరాబాదులో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న భారీ ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం ఫోటోగ్రాఫర్ల సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ… సాంకేతికతకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ఫోటోగ్రాఫర్ల సంఘ నాయకులు మాట్లాడుతూ… ఈ ఎక్స్‌పోలో నూతన కెమెరాలు, అధునాతన పరికరాలకు చెందిన దాదాపు 100 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. నూతన పరికరాల వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని కోరారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కార్యదర్శి పిన్నం కనకారావు, మండల ప్రెసిడెంట్ (సోనీ స్టూడియో అధినేత) పాషా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ ఫోటో టెక్ అధినేత అభిమన్యు రెడ్డి, కెనాన్ కెమెరా మెంటర్ భూపాల్, జిల్లా జాయింట్ సెక్రెటరీ సుమాంజలి రాము, మండల సెక్రెటరీ రాంబాబు, కోశాధికారి మూర్తి, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు గాంధీ, అన్వర్ పాషా, బాబి, పరిమి వెంకటేశ్వరరావు, హరీష్, కోటేశ్వరరావు, కల్కీ వెంకటేశ్వరరావు, మురళి, నరేష్, నవీన్, సుబ్బారావు, రాజు పాల్గొన్నారు.



