ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు..
ఏండ్లుగా పరిష్కారం కాని సమస్య!
మంత్రులు, అధికారులకు వినతులు..పరిష్కారం దక్కని వైనం
పదేండ్లుగా ఐటీఐ కాంట్రాక్ట్ ఉద్యోగి ‘నూకతోటి పెదకొండయ్య’ అరణ్యరోదన
సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపి ఆదుకోవాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – సిటీబ్యూరో
ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా సామాన్య, కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులు మాత్రం మారడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’, ‘ప్రజాపాలన’ వంటి కార్యక్రమాలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేసి, తన కాంట్రాక్ట్ ఉద్యోగం, బకాయి జీతాల కోసం పదేండ్లుగా పోరాడుతున్న ‘నూకతోటి పెదకొండయ్య’ అనే బాధితుని గాథే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
పదేండ్లుగా అపరిష్కృతంగానే సమస్య
బాధిత ఉద్యోగి పెదకొండయ్య తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ విజయ్‌నగర్ కాలనీలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఆయన అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఉద్యోగ భద్రత, బకాయి జీతాల సమస్య పరిష్కారం కాలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏండ్ల పాటు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గడిచిన 30 నెలల కాలంలో ఆయన రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. అయినా ఆయన అర్జీలు బుట్టదాఖలయ్యాయే తప్ప న్యాయం జరగలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి
పదేండ్ల కాలంలో తన జీవితాన్ని రోడ్డున పడేశారని, కనీస జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతు న్నానని పెదకొండయ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇకనైనా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని, తనకు ఉద్యోగం కల్పించి, బకాయి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా తన కుటుంబానికి జీవన భృతి కల్పించి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నా గోస ఎవ్వరికీ పట్టదా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



