
ఘనంగా అన్నదాన కార్యక్రమం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నీ శ్రీ వేంకటేశ్వర స్వామి కి గ్రామానికి చెందిన దాత తలశిల రాంబాబు, లక్ష్మి దంపతుల అల్లుడు కుమార్తె కృష్ణ ,సంయుక్త లు శని వారం వెండి కిరీటాన్ని బహుకరించి అలంకరించారు. రాంబాబు తమ ఇంటినుంచి, కుటుంబ సభ్యులు, బందు మిత్రులు, భక్తులతో మంగళ వాయిద్యాలు, మహిళల భజనలతో, దారి పొడవున భక్తులు పూలు, కొబ్బరి కాయలు సమర్పిస్తూ అంగరంగ వైభవంగా ఆలయానికి చేరుకుని అయ్యప్ప స్వామి ఆలయం ట్రస్ట్ ఛైర్మెన్ డా, గాంధీకి స్వామి వారి కిరీటం అండచేయగా, ఆలయ పూజా రులు, పండిత్, మిధి లేశ్ మిశ్రా, మోహిత్ చతుర్వేదిలు, పూజా కార్య క్రమాలు నిర్వహించి కిరీటాన్ని భక్తుల హర్షద్వారాల మధ్య వెంకటేశ్వర స్వామికీ కిరీట ధారణ చేశారు. అనంతరం దాత రాంబాబు కుటుంబ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.