
నవతెలంగాణ- డిచ్ పల్లి: నిజామాబాద్ రూరల్ లో గత పదేళ్లుగా ఏలాంటి అబివృద్ధి జరుగలేదని, వచ్చే నేలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే గ్రామల, ముస్లిం కమ్యూనిటీ అబివృద్ధి కి ప్రత్యేక నీదులను మంజూరు చేసి పనులను పూర్తి చేస్తామని మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి అన్నారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని మాదిన మస్ జిద్ లో మండల ముస్లిం లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లింలకు 4%శాతం రిజర్వేషన్ కల్పిచి వారిని అదుకోవడానికి కృషి చేయడం జరిగిందని, ఈసారి ముస్లిం సోదరులు కలిసి కట్టుగా పనిచేసి నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నుంచి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, కర్ణాటక లో ఇచ్చిన అరు గ్యారంటీ కార్డు హామీ లను అమలు చేసి చూపమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, డిసిసి డెలిగేట్ సుధాకర్, ముస్లిం కమిటీ సభ్యులు హబిబ్, ఖాజామియ, అహ్మద్, మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్,కర్స మోహన్, తాజుద్దీన్, ఆశిష్, షేక్ సలీం,మోహ్సిన్ మోతిలాల్, నారాయణ తో పాటు ఆయా గ్రామాలకు చెందిన ముస్లిం కమిటీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.