అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: మహేందర్ యాదవ్

నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడవద్దు ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహచరుడు మహేందర్ యాదవ్, భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండల రాహుల్ అన్నారు. మండలంలోని చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన యూత్ కాగ్రెస్ నాయకుడు సుదమల్ల వెంకటేష్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి దుద్దిళ్ల ఆదేశాల మేరకు మహేందర్ యాదవ్, రాహుల్  మంగళవారం ఆసుపత్రికి వెళ్లి వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపర్ డెంట్ ను అడిగి తెలుసుకున్నారు.వెంకటేష్  ఆపరేషన్ కు బ్లడ్ అవసరం ఉండగా రాహుల్ దోనెట్ చేశారు. అధైర్య పడవద్దు కాంగ్రెస్ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాము, వెంకటేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
Spread the love