ఆందోళన వద్దు.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

– యంగ్ డైనమిక్ లీడర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఈ సారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు పట్టం కట్టే  రోజులు ఎంతో దూరంలో లేదని, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎ అభ్యర్థి కి నిర్ణయించిన గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని యంగ్ డైనమిక్ లీడర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్ అన్నారు.అదివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి పరిధిలోని సాయిబాబా ఆలయం లో పలు గ్రామాలకు చెందిన మండలంలోని పలు గ్రామాలకు చెందిన యూత్ సభ్యులు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్న ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యంగ్ డైనమిక్ లీడర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొని  మాట్లాడుతూ మండలానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలని, ప్రతి ఒక్కరూ తమ పార్టీ అభ్యర్థి గేలుపే ధ్యేయంగా తన వంతు కృషి చేయాలని అప్పుడే మనం అనుకున్నది సాధిస్తామన్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రెవంత్ రెడ్డి ప్రకటించిన వాటిపై విసృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పేదలు నిరుపేదలకు కు కాంగ్రెస్ ప్రభుత్వం ఏరకంగా పని చేయబోతుందో తేలపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం రాగానే 5 లక్షల ఇల్లు నిర్మించుకోవడానికి,2లక్షల రూణమఫి,500వందలకే గ్యాస్ సిలిండర్ తోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టడానికి పునుకుం దని, ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ప్రతి ఒక్క యూత్ కార్యకర్త తన వంతు కృషి చేసి నాయకున్ని ముందు ఉంచుకోవాలని ఆయన కోరారు.  మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం అందరు కలిసి కట్టుగా పని చేయాలని, గెలుపే ధ్యేయంగా ముందుకు వేళ్దమని దానికోసం  సహకారం అందించాలని నవీన్ గౌడ్ అన్నారు. యువకులు ముందుకు నడిచినప్పుడే వ్యవస్థ మారుతుందని పేర్కొన్నారు.కేంద్రంలో, రాష్ట్రంలోని ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో మన కళ్ళ ముందు కనబడుతున్నాయని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని పిలుపు ఇచ్చారు.అనంతరం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మాజీ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగ కిషన్, మహిపాల్ నాయక్, శ్రీనివాస్, సాయి చందర్, వీరేందర్, నారాయణ, శంషుద్దీన్, అంబర్ సింగ్, విజయ్, వీరయ్య, రాజన్న, నవీన్ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love