నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో సోమవారం నమూనా ఓటింగ్ యంత్రంతో బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నమూనా ఓటింగ్ యంత్రంలో బీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఎలా ఓటు వేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే గ్రామంలో బూత్ ల వారిగా బృందావనం ఏర్పాటు చేసుకున్న స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, బూత్ ఇంచార్జిలా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ కు మూడు రోజులే సమయం ఉండడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఆయా బూతుల్లో ప్రతి ఇంటికి వెళ్తూ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడా కరపత్రాలను అందిస్తున్నారు. మూడవసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. మరింతగా గ్రామం అభివృద్ధి చెందాలంటే ముచ్చటగా మూడోసారి మంత్రి ప్రశాంత్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అర్థిస్తున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓట్లు పడేలా చేస్తాయని, అభివృద్ధి చేసిన వ్యక్తిని ప్రజల ఆదరిస్తారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.