డిండి ఎత్తిపోతల పథకం కు డిపిఆర్ ను వెంటనే ఆమోదించాలి…

DPR should be approved immediately for Dindi lift scheme...– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం ..
నవతెలంగాణ – మునుగోడు
డిండి ఎత్తిపోతల పథకం కు డిపిఆర్ ను ఆమోదించి, ప్రాజెక్టు పనులను పూర్తి చేయుటకు తగిన నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈనెల 9న నల్లగొండలో నిర్వహించే సదస్సు ను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద  కరపత్ర ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. నల్లగొండ జిల్లాలో చామ పీడిత, ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే  డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు సాగునూరు ఇవ్వడంలో పాలక పార్టీలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని మండపడ్డారు.2016లో  జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని  అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ  రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదించి పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాసి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం  ప్రాజెక్ట్ రిజర్వాయర్ పనులు నిధుల కేటాయింపు విషయములో నిర్లక్ష్యం చేస్తే , ప్రజల నుండి తిరుగుబాటు ఎదురుకోవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు, పూర్తి చేయడానికి కావలసిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న నల్లగొండలో ప్రాజెక్టుపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సులో మునుగోడు దేవరకొండ ప్రాంతంలోని రైతులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను , వేముల లింగస్వామి , ఎట్టయ్యా, జక్కల అంజయ్య , రుద్రాక్ష సైదులు ,  రేవెల్లి నరష్ తదితరులు ఉన్నారు.
Spread the love