కాలానుగుణ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ రాందాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట
వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా కాలానుగుణంగా వ్యాపించే వ్యాధుల్లో క్షేత్రస్థాయి వైద్యారోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని వినాయకపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాందాస్ అన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ఆరోగ్య సహాయకులుతో సమావేశం నిర్వహించారు. గృహ పరిసరాల శుభ్రంగా ఉండే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించడంతో పాటు మలేరియా నివారణకు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త లను తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఒ.యు వెంకటేశ్వరరావు, హెచ్.ఎస్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Spread the love