నాటకం సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది

– స్త్రీలు కూడా  నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు 
– విద్యార్థులు సాహిత్యాన్ని అధ్యయనం చేసి సృజన శీలురుగా మారాలి
– కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు  వంగరి త్రివేణి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
 అలాంటి నాటక సాహిత్యం పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. పురుషులే కాకుండా స్త్రీలు కూడా చాలామంది నాటకాలను రాసి నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని,  విద్యార్థులు సాహిత్యాన్ని అధ్యయనం చేసి మరింత సృజన శీలురుగా మారాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు  వంగరి త్రివేణి అన్నారు. నాగార్జున భౌతిక కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో నాటక సాహిత్యం   సమావేశ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా గురువారం నిర్వహించిన రెండవరోజు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన  తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యానికి అంతగా ఆదరణ కరువైందని, ఇప్పుడు స్వరాష్ట్రంలో తెలుగు సాహిత్యాన్ని ఆదరించాల్సిన బాధ్యత  ప్రభుత్వం పైన ఉందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలే కాకుండా పాలకులు కూడా తెలుగు సాహిత్యాన్ని, భాషను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ  తెలుగు భాషకు ప్రపంచ భాషల్లోనే ఒక ప్రధానమైన స్థానం ఉన్నదని, అటువంటి తెలుగు భాషా విశిష్టతను తెలియజేసేటువంటి అనేక సాహిత్య ప్రక్రియలు తెలుగులో వెలువడ్డాయని అటువంటి ప్రక్రియల్లో ఒకటైనటువంటి తెలుగు నాటక సాహిత్యం పైన ఈ రెండు రోజుల జాతీయ సదస్సు  నిర్వహించడం వల్ల అనేకమంది పత్ర సమర్పకులు పత్రాలను సమర్పించడం చాలా సంతోషంగా విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా నాటక రంగ పరిశోధకులు తాటికొండల నరసింహారావు, ఎన్వి. రఘువీర్ ప్రతాప్,రంగస్థలం నటులు, కోమలి కళా సమితి అధ్యక్షులు బక్క పిచ్చయ్య, ఎమ్. ఎల్. నరసింహారావు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, అధ్యాపకులు డాక్టర్ ఎన్. దీపిక, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, ఎస్. ప్రభాకర్, డాక్టర్ టి. సైదులు, ఎం. లింగస్వామి, బి. రమ్య, డి. అంజయ్య, గ్రంథ పాలకులు డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్ ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, అధ్యాపకులు నాగుల వేణు, ప్రవీణ్ రెడ్డి, యాదగిరిరెడ్డి తోపాటు ఇతర కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love