– డీఎస్ గ్రూప్ లో కన్ఫెక్షనరీ ప్రొఫైల్ ని మరింత పెంచుకునే వ్యూహాత్మక నిర్ణయంలో భాగమే ఈ కొనుగోలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ: భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ ధరమ్ పాల్ సత్యపాల్ గ్రూప్ (డీఎస్ గ్రూప్). ఎమ్ఎమ్ సీజీ ఉత్పత్తులతో పాటు ఎన్నో రకాల వ్యాపారాల్లో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంది డీఎస్ గ్రూప్. అలాంటి డీఎస్ గ్రూప్ ఇప్పుడు ప్రముఖ సంస్థ అయినటువంటి ద గుడ్ స్టఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ను (గతంలో గ్లోబల్ సీపీ ప్రైవేట్ లిమిటెడ్) సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ద గుడ్ స్టఫ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లవ్ ఇట్ చాక్లెట్ అండ్ కన్ఫెక్షనరీ ఉంది. గతంలో ఇది గోల్డ్ మ్యాన్ సాచ్స్ మరియు మిట్సుయు వెంచర్స్ ఆధ్వర్యంలో ఉండేది. డీఎస్ గ్రూప్ నకు సంబంధించిన కన్ఫెక్షనరీ పోర్ట్ ఫోలియోలో మరింత వృద్ధిని సాధించే వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా దీన్ని సొంతం చేసుకుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ మరియు గ్రాసరీ, రిటైల్ ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకునందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
డీఎస్ గ్రూప్ 2012లో కన్ఫెక్షనరీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పాస్ పాస్, పల్స్, చింగిల్స్, రజనిగంధ సిల్వర్ పెరల్స్, మేజ్ వంటి ప్రముఖ చాక్లెట్ బ్రాండ్ లు అన్నీ డీఎస్ గ్రూప్ నకు చెందినవే. అంతేకాకుండా రీసెంట్ గా మొట్టమొదటిసారిగా స్విస్ చాక్లెట్ బ్రాండ్ Läderach ని భారతదేశంలో డీఎస్ గ్రూపే లాంచ్ చేసింది. గత 7 ఏళ్లుగా హార్డ్ బాయిల్డ్ క్యాండీ విభాగంలో పల్స్ అగ్రగామిగా ఉంది డీఎస్ గ్రూప్. ఇప్పుడు లవ్ ఇట్ బ్రాండ్ కు సంబంధించిన చాక్లెట్ మరియు కన్ఫెక్షనరీ ఉత్పత్తులను మార్కెట్ లోకి మరింత ఉదృతంగా తీసుకురాబోతుంది. ఈ సంస్థకు చెందిన ఉత్పత్తులు మిల్కీ చాక్లెట్, క్రంచీ చాక్లెట్స్, ఫ్రూట్/చాక్లెట్ రుచిగల లాలీపాప్‌లు, ఎక్లెయిర్స్, చాకో స్మాక్స్, చోకోలేట్‌లు మరియు పంచదార పాన్‌లతో కూడిన మిల్కీ చాక్లెట్‌లతో గ్రూప్ యొక్క కన్ఫెక్షనరీ పోర్ట్‌ఫోలియోను మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా డీఎస్ గ్రూప్ వైస్ చైర్మన్ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా డిఎస్ గ్రూప్ కన్ఫెక్షనరీ విభాగంలో తమ ఉనికిని పెంచుకోవడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే లవ్ ఇట్ కొనుగోలు చేసింది. తద్వారా మా కన్ఫెక్షనరీ బాస్కెట్ ని మరింత మెరుగుపర్చుకున్నట్లు అవుతుంది. చాక్లెట్ విభాగంలోకి ప్రవేశించాలనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఇది మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. దాంతోపాటు కొత్త వినియోగదారులు మరియు మార్కెట్‌లను కూడా చేరుకోవచ్చు. లవ్ ఇట్ ఒక బ్రాండ్‌గా, మా పోర్ట్‌ఫోలియోను సంపూర్ణంగా పూర్తి చేస్తుంది. సరికొత్త ఆవిష్కరణలు, ప్రీమియం నాణ్యతతో మా వ్యాపారాన్ని మరింత పెంచుతుంది అని అన్నారు. డీఎస్ గ్రూప్ నకు చెందిన ఉత్పత్తులు ఇప్పుడు మరింత ఎక్కువ అవుతాయి. తద్వారా దక్షిణ భారతదేశంలో బలమైన కంపెనీగా అడుగుపెట్టేందుకు అవకాశం ఏర్పడింది. డీఎస్ గ్రూప్ ఇప్పటికే నాన్-చాక్లెట్ మిఠాయి విభాగంలో ప్రముఖ ప్లేయర్లలో ఒకటిగా ఉంది. ఇప్పుడు బ్రాండ్ లవ్ ఇట్ ని సొంతం చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా డీఎస్ గ్రూప్ బలమైన పంపిణీ నెట్‌వర్క్ ఉన్న సంస్థగా మారింది. ఈ నెట్ వర్క్ ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందుతుంది. వినూత్నమైన మరియు విభిన్నమైన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకున్న గుడ్ స్టఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2014లో స్థాపించారు. కంపెనీ రూ.100 కోట్ల కంటే ఎక్కువ (F/Y 21-22) టర్నోవర్‌ని కలిగి ఉంది. ఇందులో 90 శాతం లవ్ ఇట్ బ్రాండ్ నుంచి వస్తున్నదే. భారతీయ కన్ఫెక్షనరీ మార్కెట్ విలువ సుమారు రూ.23,000 కోట్లు. వీటిలో చాక్లెట్లు దాదాపు 60% వాటాతో రూ.13,800 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. భారతీయ చాక్లెట్ మార్కెట్ 2028 నాటికి 6.69% సీఏజీఆర్ వద్ద వృద్ధి చెందుతుందని ఒక నివేదిక అంచనా వేసింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు విభిన్న వ్యాపార వర్గాల్లో విజయవంతమైన బ్రాండ్‌లను నిర్మించడాన్ని కొనసాగిస్తోంది డీఎస్ గ్రూప్. అదే సమయంలో ‘నాణ్యత మరియు ఆవిష్కరణ’ విషయంలో ఎక్కడా రాజీపడకుండా వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.