ఆత్మస్థైర్యంతో ఉంటే అపజయాలు దరిచేరవు : డి.ఎస్.ఏ జెల్లా సత్యనారాయణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆత్మస్థైర్యంతో ఉంటే ఏ రంగంలో అయినా రాణించే అవకాశం ఉందని,క్రీడా స్పూర్తి తో ఏ పని తలపెట్టినా అపజయాలు దరిచేరవని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ ఎఫ్పైర్స్ జెల్లా సత్యనారాయణ విద్యార్ధులను ఉద్దేశించి అన్నారు. క్రీడా స్పూర్తి ఇలానే విద్యా,విద్యేతర రంగాల లోనూ కనుబరుస్తూ భవిష్యత్తులో  గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.విద్యార్థి ఆత్మస్థైర్యంతో  ఉంటూ అన్ని క్రీడలలో ఉత్సహంగా పాల్గొన్నారని  అంతేకాకుండా విద్యార్ధులను అభినందించారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన అంతర – కళాశాల క్రీడలు,ఆటల పోటీలు గురువారం ముగిసాయి.
            ఈ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆటల్లో పాల్గొన్నటువంటి వారందరిని అభినందించారు.వివిధ ఆటలో పోటీ పడిన విజేతలను ప్రశంసించారు. అంతర కళాశాలల క్రీడలు, ఆటల పోటీల నివేదికను విశ్వవిద్యాలయం పరిశీలకులు జే.సురేష్ నివేదించారు. ఆయన మాట్లాడుతూ అన్ని కళాశాల విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని,సమన్వయం పాటిస్తూ ఆడే విదానాన్ని కొనియాడారు.ఇంతకు ముందు కేవలం 5 కళాశాలలు పోటిలో ఉండేవని, కాని ఈ సంవత్సరం 11 కళాశాలలు పోటీలో పాల్గోన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను అందించిన అశ్వారావుపేట  వ్యవసాయ కళాశాల సిబ్బందిని అభినందించారు.
        స్థానిక కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత కుమార్ మాట్లాడుతూ.. ఈ క్రీడలను అశ్వారావుపేట లో నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన విశ్వవిద్యాలయం యాజమాన్యానికి ముందుగా అశ్వారావుపేట కళాశాల తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేశారు.విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వారి శారీరిక, మానసిక ఆరోగ్యంతో  పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది అని,అలానే క్రీడల కోటాలోనూ ఉద్యోగం సంపాదించడానికి ఈ క్రీడలు దోహదపడతాయని వివరించారు. అనంతరం ముఖ్య అతిథి లు చే విజేతలైనటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
        2023 – 2024 అంతర కళాశాలల క్రీడా, ఆటల పోటీల్లో ఓవరాల్ చాంపియన్స్ గా రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల, వ్యక్తిగత అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ బాలురు విభాగంలో రాజేంద్రనగర్ కళాశాలకు  కే.యోగేష్ నిలిచారు. బాలికల విభాగంలో జగిత్యాల కళాశాలకు చెందిన సీ.హెచ్ సుష్మా ప్రియాంక విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిధిలోని ఆ 11 కళాశాలల నుండి ఒ.ఐ.ఎస్.ఎ లు, ఫిజికల్ డైరెక్టర్స్, అధికారులు, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love