కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి


నవతెలంగాణ దుబ్బాక రూరల్: దుబ్బాకలో ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిన సందర్భంగా సోమవారం మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో తన గెలుపు కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానన్నారు. పార్టీ కోసం,తన గెలుపు కోసం క్రియాశీలకంగా పని చేసిన వారందరికీ తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. దుబ్బాక లో 53వేల 707 ఓట్లతో భారీ మెజార్టీ కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానన్నారు. అంతక ముందు తన గెలుపు కోసం కష్టపడి పని చేసి సర్పంచ్ పర్షరాములు, కనకరాజులతో పాటు గ్రామ శాఖ, సోషల్ మీడియా వారియర్స్, బూత్ కమిటీ అధ్యక్షులను శాలువాతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంట అధ్యక్షులు ముక్క పల్లి మహేందర్, బూత్ అధ్యక్షులు ఐలయ్య, సోషల్ మీడియా అధ్యక్షులు, పార్టీ నాయకులు మండల కనకయ్య, లింగం, బాలరాజు, హరీష్, రమేష్, అరవింద్, కార్తిక్, శ్రీకాంత్, భాస్కర్ తదితరులు ఉన్నారు.

Spread the love