పార్థివ దేహానికి నివాళులర్పించిన దుద్దిల్ల శ్రీను బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని గట్లకుంట గ్రామానికి చెందిన పీఎసీఎస్ డైరెక్టర్ రాజు నాయక్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు సోమవారం పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన వెంటా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే కాటారం మండల కేంద్రంలో చేనాల పోచిరెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందగా మృతుని పార్థివఫెహానికి పూలమాల వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Spread the love