యాచారంలో ఇంటింటికి రామ మందిర ప్రారంభోత్సవ అక్షింతలు అందజేత

నవతెలంగాణ-యాచారం
మండల కేంద్రంలోని యాచారం గ్రామంలో అయోధ్య రామ మందిరం క్షేత్ర ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవ అక్షింతలు ఆదివారం ఇంటింటికి తిరిగి అందజేశారు. సభ్యులు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ఇంటింటికి అందించారు. అనంతరం వారు రామ మందిరం ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభం కానొందని వారు వివరించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love