నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శుక్రవారం నుంచి దసరా సెలవులుంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 25 వరకు 13 రోజులుపాటు ఈ సెలవులుంటాయని స్పష్టం చేసింది. జూనియర్ కళాశాలలకు ఈనెల 19 నుంచి 25 వరకు ఏడు రోజులు సెలవులిచ్చింది. ఈనెల 26 నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో తరగతులు పున:ప్రారంభమవుతాయి. శనివారం నుంచి 24 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కాలేజీలకు దసరా, బతుకమ్మ సెలవులుంటాయని ప్రకటించింది. ఈనెల 25న ఆ వర్సిటీ పరిధిలోని కాలేజీలు పున :ప్రారంభమవుతాయి. అయితే దసరా పండుగ సెలవును ఈనెల 24న కాకుండా 23వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 14 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.