Saturday, June 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఫిలిప్పీన్స్‌ లో భూకంపం

ఫిలిప్పీన్స్‌ లో భూకంపం

- Advertisement -

రిక్టరు స్కేలుపై 6.5గా తీవ్రత నమోదు
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్‌ ను భారీ భూకంపం వణికించింది. మిందనౌలో శుక్రవారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్ జెడ్) భూకంప లోతును 29 కిలోమీటర్లుగా నివేదించింది. భూప్రకంపనలు రావడంతో ప్రభావిత తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు.. తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరాలు వెలువడాల్సి ఉంది. కొన్ని వారాల క్రితం ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించడంతో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -