రూ.2వేల నోటు మార్పిడికి వెసులుబాటు..!

రూ.2,000 నోటు సాధారణ మార్పిడికి వెసులుబాటు కల్పించారు. ఇంకా మార్కెట్‌లో రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. పెద్ద నోటు ఉపసంహరణ ప్రకటన తర్వాత ఇప్పటి వరకు 96 శాతానికి పైగా నోట్లు బ్యాంకింగ్‌లోకి తిరిగి వచ్చాయన్నారు. వీటి విలువ రూ.3.43 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఇందులో 87 శాతం బ్యాంక్‌ డిపాజిట్లుగా వచ్చాయని, మిగిలినవి ఇతర నోట్లతో ఎక్సేంజీ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. కాగా.. అక్టోబర్‌ 8వ తేదీ తర్వాత కూడా ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని శక్తికాంత దాస్‌ తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయన్నారు. రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బిఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Spread the love