నాలుగు నెలల కనిష్టానికి విదేశీ మారకం నిల్వలు

Foreign exchange reserves of minimum four monthsముంబయి : వరుసగా రెండో వారంలోనూ భారత విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి. సెప్టెంబర్‌15తో ముగిసిన వారంలో 860 మిలియన్‌ డాలర్లు కరిగిపోయి 593.037 బిలియన్లుగా నమోదయ్యాయయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇంతక్రితం వారంలో ఏకంగా 4.99 బిలియన్‌ డాలర్లు క్షీణించాయి. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గాయని ఫారెక్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 అక్టోబర్‌లో భారత విదేశీ మారకం నిల్వలు 645 బిలియన్‌ డాలర్లకు చేరి ఆల్‌టైం గరిష్ట స్థాయిని నమోదు చేశాయి.

Spread the love