పోస్టల్‌ బ్యాలెట్‌ పై ఈసీ స్పష్టత

నవతెలంగాణ ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ సందేశంపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) స్పందించింది. అది నకిలీ సమాచారం అని ఎక్స్ వేదిగా స్పష్టం చేసింది. అలాగే పోలింగ్ రోజున ఓటర్ కార్డు మర్చిపోతే ఏ ఇతర కార్డులు తీసుకెళ్లొచ్చో కూడా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయకుండా నిషేధం విధించినట్లు ఒక సందేశం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. అది తప్పుదోవ పట్టించే, నకిలీ సందేశమంటూ తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు తమకు కేటాయించిన కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు’’ అని వెల్లడించింది.
ఓటర్ లిస్టులో పేరు ఉంటే చాలు
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సౌకర్యం కల్పించింది. పోలింగ్‌ బూత్‌కు ఓటర్ కార్డు తీసుకురాలేదా..? పోలింగ్ రోజు బూత్‌కు ఓటర్ కార్డు తీసుకెళ్లడం మర్చిపోయారా..? అయినా ఫర్వాలేదు అంటోంది ఈసీ. ఓటర్ లిస్టులో పేరు ఉంటే చాలు. ఓటు వేసేందుకు ఇతర గుర్తింపు కార్డులు తీసుకోవచ్చంటూ వెల్లడించింది.

  • పాస్‌పోర్ట్‌
  • డ్రైవింగ్‌ లైసెన్సు
  • కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు
  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం
  • బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి)
  • పాన్‌కార్డు జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు
  • ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు
  • కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు
  • యూనిక్‌ డిజెబిలిటీ ఐడీ(UDID) కార్డు
  • ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు
  • ఆధార్‌ కార్డు
Spread the love