ప్రియాంకపై ఈడీ గురి

priyanka gandhi– మనీలాండరింగ్‌ కేసులో తొలిసారి సోనియా కుమార్తె పేరు
న్యూఢిల్లీ: ఎన్నారై వ్యాపారవేత్త సి.సి థంపీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలిసారిగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో చార్జీషీట్‌లో ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా పేరును ఈడీ పేర్కొన్నది. ”కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారు. వారు ఎన్నారై వ్యాపారవేత్త సి.సి థంపీకి కూడా భూమిని విక్రయించారు” అని ఈడీ తన ప్రకటనలో పేర్కొన్నది. వాద్రా, థంపీకి సామాన్య, వ్యాపార ప్రయోజనాల విషయంలో సంబంధం ఉన్నదని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

Spread the love