
మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో అలేర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల్ ఐలయ్య జాగృతి అధ్యక్షురాలు కవిత పైన అనుచిత వాక్యాలు చేసినందుకు గాను బుధవారం వినాయక్ చౌరస్తా దగ్గర ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి మాజీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచు అయినటువంటి కవిత నీ లిక్కర్ కు సంబంధించిన అసభ్య పదజాలం తో మహిళను కించపరుస్తూ మాట్లాడటం యావత్ తెలంగాణ మహిళలను కించపరచడం లాంటింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల తెలంగాణ మొత్తం విస్తరింప చేయడం మహిళలను అందిరని బతుకమ్మ కార్యక్రమాలతో ఒక్క తాటి పైకి తీసుకువచ్చి మహిళా ఐక్యత ను చాటి చెప్పడం.ఒక ఎంఎల్ఏ గా విప్ గా మీరు ఒక బాధ్యత గల పోసిషన్ లో ఉన్నారు.కానీ మీరుకూడా రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బు సంపాదించి ఈ రోజు అసెంబ్లీ లో అడుగుపెట్టడానికి కారణం కేసీఆర్, కేసీఆర్ చేసిన అభివృద్ధి అలాంటి అభివృద్ధి నీ ,మీ ప్రభుత్వం అన్ని పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనీ, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయండి కానీ వ్యక్తి గత విమర్శలను మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జాగృతి నాయకులు తంగళ్లపల్లి శ్రీకాంత్, మంచాల సంతోష్,మచ్చ చక్రవర్తి,ఆకుల నరేష్,పోతంషెట్టి శ్రీకాంత్,రిజ్వాన్,బర్ల ప్రమోద్,శివ,సాయినాథ్, భాను,సురేష్,నితీష్, రత్నపురం శ్రీకాంత్,మహేందర్,అజయ్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.