నవ తెలంగాణ- హుస్నాబాద్ రూరల్: ఐటీ సెల్ అనే సంస్థలో రాహుల్ గాంధీని రావణాసురునిగా ఫోటోలు చిత్రీకరించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ ని రాక్షసుని లా బొమ్మను తయారుచేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండలం అధ్యక్షులు బంక చందు, అక్కన్నపేట అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, వల్లపు రాజు మడప యాదవరెడ్డి, బోనా గిరి రజిత వెన్నరాజు బూరుగు కిష్ట స్వామి పోతుగంటి బాలయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.