నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డులోని సమస్యలు సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నె త్రిశాంక్ హామీ ఇచ్చారు. శనివారం రాత్రి గాంధీ నగర్‌లో 12వ బస్తీ నిద్ర కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో సుమారు 300 మంది స్థానికులు పాల్గొని వారి సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ బస్తీ సమస్యలు పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నట్టు చెప్పారు. బోర్డు ఎన్నికలు జరగకపోవడం, మరో వైపు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు 5వ వార్డుకు చెందినప్పటికీ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఏ బస్తీలో చూసినా స్థానికులు అనేక సమస్యలు చెబుతున్నారని, ఐదో వార్డు సమస్యలను కూడా బోర్డు సీఈఓ దష్టికి తీసుకుపోతామని, తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు. స్థానికంగా నిర్మిస్తున్న శ్రీ నల్ల పోచమ్మ ఆలయ గోపురం కోసం ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు క్రిశాం క్‌ను కోరగా క్రిశాంక్ తక్షణమే సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం స్థానికు లతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గంటా రాజు, యాదగిరి, మల్లప్ప, భీమప్ప, గడ్డం రాజు, మోని, రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ి