సాలూర గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటి ఎన్నిక

నవతెలంగాణ  – బోధన్

సాలూర మండలం సాలూర గ్రామ  నూతన ఎమ్మార్పీఎస్ కమిటీని శనివారం సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా మొండూర్  చంటి, ఉపాధ్యక్షులుగా ధమ్మన్ గావ్ సుభాష్, ప్రధాన కార్యదర్శిగా కొండల్ వాడి రాజు, సహాయ కార్యదర్శిగా మొండూర్ అశోక్, కోశాధికారిగా కుంటన్ సాయికుమార్, ప్రచార కార్యదర్శిగా టన్నె రవి లను, అలాగే ఐదుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సంధర్బంగ నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ అభివృద్దికి తనవంతు కృషి చేస్తామని వారు తెలిపారు.అనంతరం నూతన కమిటీ సభ్యులను దండోరా నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో  మాదిగ మేధావుల ఫోరం జిల్లా సహాయ కార్యదర్శి లింబూరి లక్ష్మణ్, దండోర నాయకులు మొండూర్ లస్మయ్య,  మొండూర్ లాలయ్య,  ధమ్మన్ గావ్ హరిబాబు, వీరేషం, బాలయ్య,  భూమయ్య, మహిళలు పాల్గొన్నారు.
Spread the love