డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామ అభివృద్ది కమిటి నీ శుక్రవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులుగా గుండ పావు రాజ్ , ప్రధాన కార్యదర్శి రమణ చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు గా దుంపటి భూమయ్య, సాయిలు,సుబన్న, వినోద్ రెడ్డి,రమేష్, గంగాధర్,రాజన్న ,సురేందర్ గౌడ్, సాయి కుమార్, దత్తు,సాగర్, లింగయ్య,ఎల్లయ్య, శ్రీను, తిక్కన్న లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కి అందరూ కలిసి కట్టుగా ఉంటునే అబివృద్ధి చేసుకుంటామని వారన్నారు.తమపై నమ్మకముంచిన వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.