గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి చెందాడు. చంపాపేట్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల నేపథ్యంలో రెడ్డిల్స్లోని కేంద్రానికి ఆదివారం సాయంత్రం పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు.  ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది.

Spread the love