Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండెపోటుతో వ్యక్తి మృతి.. కుటుంబానికి అండగా విద్యుత్ శాఖ 

గుండెపోటుతో వ్యక్తి మృతి.. కుటుంబానికి అండగా విద్యుత్ శాఖ 

- Advertisement -

– రూ.63,500 ఆర్థిక సహాయం అందజేత 
నవతెలంగాణ – నర్సింహులపేట
: మృతుని కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల నర్సింహులపేట మండలం ముంగిమడుగు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్డ్‌గా పనిచేస్తున్న గూగులోతు నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. గత కొన్నేళ్లుగా విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్డ్‌ ఉద్యోగిగా పనిచేసిన ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి బుధవారం విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది కలిసి రూ.63,500 ఆర్థిక సహాయాన్ని మరిపెడ ఏడిఈ ఎం.శ్రీనివాస్, ఏఈ పాండు నాయక్ చేతుల మీదుగా అందజేశారు. విద్యుత్ శాఖ తరఫున పీఎఫ్‌, ఇతర సౌకర్యాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ హరీష్, గుగులోతు మాలు, మల్సూర్, కిషన్, ఉప్పలయ్య, సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -