ఇంజినీరింగ్‌ శాఖల్లో ‘ఇంజినీర్స్‌ డే’

–  రక్తదాన శిబిరం నిర్వహణకు సన్నాహాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రముఖ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు నేపథ్యంలో ఈనెల 15న హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఇంజినీర్స్‌ డే నిర్వహించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, మిషన్‌ భగీరథ ఉద్యోగ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రెండు శాఖల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు ఎజీ సంజీవరావు, ఎం కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని పీఆర్‌ సీఈ జీ సీతారాములు తెలిపారు అలాగే పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానీయాను ఆహ్వానించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love