మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్లో పిల్లలను చేర్పించండి

– రెసిడెన్షియల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ సిబ్బంది
నవతెలంగాణ-జవహర్‌నగర్‌
మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో పిల్లలను చేర్పించాలని శుక్రవారం జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ మైనార్టీ కమిటీ సభ్యులు, మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ సిబ్బందితో కలిసి అన్ని మసీదుల దగ్గర క్యాంపులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్‌ నియోజకవర్గంలో బాలుర కోసం జగన్‌ గూడలో, బాలికల కోసం రాంపల్లి ఎక్స్‌ రోడ్‌ దగ్గర రెసిడెన్షియల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పేరొకన్నారు. నాణ్యమైన ఉచిత విద్య, హాస్టల్‌ వసతి కలదని, యూనిఫామ్స్‌, నోట్‌ బుక్స్‌, పుస్తకాలు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించి పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. జవహర్‌ నగర్‌లోని ప్రతి ముస్లింలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్‌ సాదిక్‌, రఫిక్‌, మతీన్‌, హైమత్‌ పాషా, ఖాసీం శంషోద్దీన్‌, ఇమామ్‌, ఫైజల్‌ పాల్గొన్నారు.

Spread the love