సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదును పెంచాలి

– ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి : విద్యామంత్రి సబితకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాఠశాల విద్యకు సంబంధించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును పెంచేం దుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి ఆయన గురువారం లేఖ రాశారు. పాఠశాలల పున:ప్రారంభం నుంచే ఉపాధ్యాయు ల కొరత లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో సమస్యలను పరి ష్కరించాలని తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరాన్ని సజావుగా నిర్వహించాలని పేర్కొ న్నారు. జూన్‌ రెండు నుంచి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నందున ఉపాధ్యా య సంఘాలతో మాట్లాడాలని సూచించారు. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విద్యార్థుల నమోదు పెంపుదలకు ప్రత్యేకంగా తల్లిదండ్రు లను కలిసి పిల్లలను చేర్చుకునే విధంగా ప్రోత్స హించాలని కోరారు. సర్పంచ్‌లు, వార్డు మెంబ ర్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సహకరిం చేలా పంచాయతీ రాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖల నుంచి తగు సూచనలివ్వాలని తెలిపారు. సంబం ధిత శాఖల మంత్రులు ప్రకటనలిస్తే మంచి దని వివరించారు. సర్దుబాటు చేసినా 2022-23 విద్యాసంవత్సరంలో 20 శాతానికిపైగా పాఠశా లల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని పేర్కొన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోగా కొత్త నియామ కాలు చేసే అవకాశం లేనందున ఐదు వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయుల నియామ కానికి వచ్చే నెల 12లోగా అనుమతి తీసుకోవా లని కోరారు. అదనపు ఉపాధ్యాయుల సర్దుబాటు వచ్చేనెల 12లోగా చేయాలని సూచించారు.
పాఠశాలల ప్రారంభం తర్వాత ఏదైనా స్కూళ్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే సర్దుబాటు ద్వారా వేరే బడికి పంపిన టీచర్‌ను తిరిగి పంపించాలని పేర్కొ న్నారు. అవసరమైన చోట తాత్కాలిక టీచర్‌ను నియమించాలని తెలిపారు. ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కనుగుణం గా టీచర్లుండేలా ఏర్పాటు చేయాలని వివరించా రు. పాఠశాల నిర్వహణ గ్రాంటు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటే బడుల్లో సరిపోవడం లేదని పేర్కొన్నారు. విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. పాఠశాల నిర్వహణ గ్రాంటు అదనంగా విడుదల చేయాలని కోరారు.
రూ.200 కోట్లతో పారిశుధ్యం సమస్య పరిష్కారం
పాఠశాలల్లో 90 శాతం ఆఫీసు సబార్డినేటు పోస్టుల్లేవని నర్సిరెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పారిశుధ్యం గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ద్వారా చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. 15 శాతం బడుల్లోనే ప్రత్యేకంగా ఒక సర్వీసు పర్సన్‌ ఇచ్చారని వివరించారు. దీంతో పారిశుధ్యం, ఇతర పనులు, పాఠశాలలకు తాళం వేయటం, తీయటం వంటివి సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. 85 శాతం బడుల్లో అరకొరగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. 50 శాతానికి పైగా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు కొంత మొత్తం వేసుకుని సర్వీసు పర్సన్లను పెట్టు కున్నారని వివరించారు. దీనికోసం రూ.200 కోట్లు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయిస్తే ఒక్కో సర్వీస్‌ పర్సన్‌కు నెలకు రూ.ఆరు వేల చొప్పున 26 వేల పాఠశాలల్లో పారిశుధ్యం, ఇతర పనుల సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. మోడల్‌ స్కూళ్లలో తాత్కాలిక ఉపాధ్యాయులను జూన్‌ 12 నుంచే నియమించాలని కోరారు. కొన్ని బడుల్లో విద్యార్థుల నమోదు తగ్గిందని తెలిపారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ఈ స్కూళ్లలో ఇంటర్‌ విద్యార్థుల నమోదు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టల్‌ ఇంచార్జీ బాధ్యతల నుంచి కేజీబీవీ ప్రత్యేక అధికారులను తప్పించాలని సూచించారు. కేజీబీవీల్లో ఉపాధ్యా యులపై పనిభారాన్ని తగ్గించేందుకు కేర్‌టేకర్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ తరగతులు నిర్వహించే కేజీబీవీల్లో వంటకు, ఇతర పనుల కోసం అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు.

Spread the love