– తహసిల్దార్ నరేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పారాన్ని పూర్తి చేసి గడువులోగా బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని తహసిల్దార్ నరేష్ అన్నారు. మంగళవారం ఆయన బాల్కొండ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాల, పరిధిలోని తండాలలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓటర్లు ఎన్యూమరేషన్ హారాలను గడువులోపు అందించకపోతే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధన ప్రకారం పత్తి అర్హుడైన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.ఎన్యూమరేషన్ వరాలను సరైన వివరాలతో నింపి నిర్నిత గడువులోగా బూత్ లెవల్ అధికారులకు అందించడం ఓటరు బాధ్యత అన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్ లైన్ చేస్తున్న బూత్ లెవల్ అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఆయన వెంట మండల రెవెన్యూ అధికారి శరత్, గ్రామ పాలన అధికారి, సిబ్బంది తదితరులు ఉన్నారు.


