
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా పాలన సేవ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ రాజదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు తమకు ఎలాంటి సందేహాలు ఉన్న ప్రజా పాలన సేవ కేంద్రంలో పరిష్కారం చేయబడతాయని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో పర్బన్న. ఎంపీ వో శ్రీనివాస్. సీనియర్ అసిస్టెంట్ వెంకటరామిరెడ్డి. సూపరిడెంట్ తదితరులు పాల్గొన్నారు.