విన్నవించుకున్నా వినలేకపాయే..!

– శ్రమదానం చేసి సర్దుబాటు చేసుకునే
నవతెలంగాణ-రెబ్బెన
మండలంలోని గోలేటి విలేజ్‌లోని హనుమాన్‌ ఆలయం నుండి సేవాలాల్‌ ఆలయానికి వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో రహదారిపై ఏర్పడిన గుంతలను గోలేటి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేశారు. గోలేటి సేవాలాల్‌ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం శ్రమదానం నిర్వహించి గ్రామంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలను మరమ్మత్తులు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ అధికారులకు, ప్రభుత్వాలకు విన్నవించిన పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్‌ ఏర్పాటైన తర్వాత గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌ల పదవికాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి అధికారుల పాలనలో జిల్లాలోని పంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్ల స్థితిగతులను అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా గుంతలను వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలకు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడంతో ఆలయ కమిటి నిర్ణయం మేరకు శ్రమదానం చేసి గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Spread the love